రాగల 24 గంటల్లో ఉత్తర తెలంగాణ(telangana)లోని కొన్ని జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు(heavy rains) ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని, జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లోనూ ఆకాశం మబ్బు పట్టి ఉంటుందని ప్రకటించింది.