ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి ఈనెల 14 వరకు కొనసాగుతాయని ప్రకటించింది. ఇంకొన్ని గంటల్లో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ‘యెల్లో అలర్ట్(Yellow Alert)’ జారీ చేసింది. రేపు(ఈనెల 11) ఉదయం 8:30 నుంచి ఈనెల 12 పొద్దున వరకు కుమురం భీమ్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది.