ఇంకొన్ని గంటల్లో వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. రుతుపవన ద్రోణికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో 12 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ఇచ్చింది. నల్గొండ(Nalgonda), సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్(Warangal), హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని ప్రకటించింది. రేపు పొద్దున 8:30 నుంచి ఎల్లుండి వరకు నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలుంటాయి. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com