భారీ వర్షంతో కార్ల షోరూం(Show Room)లో నీరు నిండటంతో అందులో పనిచేసే 30 మందిని అధికారులు రక్షించారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు.. రోడ్లను నదుల్ని చేశాయి. బేగంపేట ప్యాట్నీ(Patny) వద్ద నాలా పొంగడంతో సికింద్రాబాద్ రసూల్ పురాలోని కార్ల షోరూంలో సిబ్బంది చిక్కుకున్నారు. సదరు భవనంలో నీరు నాలుగు అడుగులకు పైగా చేరింది. బోట్ల ద్వారా వారందర్నీ బయటకు తీసుకువచ్చారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో 12 సెం.మీ., హైదరాబాద్ మారేడ్ పల్లిలో 11.4, మేడ్చల్ జిల్లా బోయిన్ పల్లిలో 11.4, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మాసాగర్ లో 10.8, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.