
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 8 జిల్లాల్లో 11.5 సెం.మీ. నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే ఆస్కారం ఉందని హెచ్చరికలు చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఈ రెండ్రోజులు భారీ వర్షాలు ఉన్నాయంది. ఇక మరో ఏడు జిల్లాల్లో 6 సెం.మీ. నుంచి 11 సెం.మీ. నమోదయ్యే అకాశముంది. నైరుతి రుతుపవనాలు ఆదివారం నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపింది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో అలర్ట్ గా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. శుక్రవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రాష్ట్రంలో.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో 8.1 సెం.మీ. హయ్యెస్ట్ వర్షపాతం రికార్డయింది.