నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజుల(two day) పాటు కంటిన్యూ కానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(imd) తెలిపింది. శనివారం పొద్దున్నుంచి ఆదివారం పొద్దున వరకు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
24 గంటల్లో భారీ వర్షపాతాలు
గత 24 గంటల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(U)లో రాష్ట్రంలోనే అత్యధికంగా 23.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. నిర్మల్ జిల్లాలోని కడ్డం పెద్దూరులో 22.4 సెంటీమీటర్లు, పెంబిలో 15.4 సెం.మీ., జైనూరులో 14, జన్నారంలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు.