రాబోయే రెండ్రోజులు అత్యంత భారీ వర్షాలు(Very Heavy) ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తొలిరోజు 19 జిల్లాల్లో, రెండోరోజు 4 జిల్లాల్లో వానలుంటాయి. జులై 22 పొద్దున 8:30 నుంచి 23 ఉదయం 8:30 వరకు… ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది.
23 నాడు పొద్దున 8:30 నుంచి 24న 8:30 వరకు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం కలిపి మొత్తంగా 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com