మరికొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ(Very Heavy) వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల(Mancherial), కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయని తెలిపింది. రేపు(జులై 24) 2 జిల్లాలైన జయశంకర్ భూపాలపల్లి, ములుగులో ఇదే వాతావరణం కంటిన్యూ అవుతుందని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఈ జిల్లాల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది.