ఇంకొన్ని గంటల్లో భారీ నుంచి అతిభారీ(Very Heavy) వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, యాదాద్రి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, మేడ్చల్, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలకు గాను ‘యెల్లో అలర్ట్’ జారీ చేసింది. మెదక్ లో 17.6, రంగారెడ్డి జిల్లా గునెగల్ లో 17.4, యాదాద్రి జిల్లా మోటకొండూర్ లో 15.8 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.