కొన్ని గంటల్లో ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. మరో 17 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ‘యెల్లో అలర్ట్’ జారీ చేసింది. ఇక నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లిలో 19.5, ఆదిలాబాద్ జిల్లా బేల(Bela)లో 16 సెం.మీ. వర్షం పడింది.