కొన్ని జిల్లాల్లో ఇప్పుడే వర్షాలు తగ్గేలా కనిపించడం లేదు. రేపు(సెప్టెంబరు 9న) రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ(Very Heavy) వర్షాలు పడే అవకాశముందంటూ ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ రెండు జిల్లాలతోపాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఇవాళ్టి నుంచి రేపటి వరకు ‘ఆరెంజ్’ అలర్ట్ అమల్లో ఉంది.
ఈ నెల 10, 11, 12 తేదీల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉన్నందున ఆ మూడు రోజులు ‘యెల్లో అలర్ట్(Yellow Alert)’ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం సహా వివిధ జిల్లాల్లో వర్షాలుంటాయని అంచనా వేసింది.