ఓబుళాపురం మైనింగ్(OMC) కేసులో.. IAS శ్రీలక్ష్మీకి షాక్ తగిలింది. నిందితుల లిస్ట్ నుంచి పేరు తొలగించాలన్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తొలుత CBI కోర్టు నిరాకరిస్తే హైకోర్టు మెట్లెక్కారు. పేరు తొలగిస్తూ హైకోర్టు ఆదేశాలిస్తే, సుప్రీంను ఆశ్రయించింది CBI. అయితే CBI వాదనలు విని 3 నెలల్లో తీర్పివ్వాలంటూ మే నెలలో సుప్రీం ఆదేశించింది. లీజును నాటి మంత్రి సబిత, కృపానందమే చూశారని, శ్రీలక్ష్మీ పాత్ర లేదని ఒకవైపు.. జీవోలో IASదే కీలక పాత్ర అని మరోవైపు సాగిన వాదనలు విన్న కోర్టు.. IAS పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురు దోషులుగా తేలితే.. సబిత, కృపానందం నిర్దోషులుగా బయటపడ్డారు. కానీ శ్రీలక్ష్మీకి హైకోర్టులో షాక్ తగలడంతో.. ఇక CBI కోర్టులో మరోసారి విచారణ జరుగుతుంది.