తప్పుడు ప్రమాణ పత్రాలతో తప్పుదోవ పట్టించారంటూ గ్రూప్-1(Group-1) పిటిషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 19 మంది అభ్యర్థులు గత నెల(మార్చి)లో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక.. తప్పుడు అపిడవిట్లు దాఖలు చేసిన పిటిషనర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. TGPSC జారీ చేసిన మార్కుల మెమోకు, వెబ్ సైట్లోని మార్కుల మధ్య తేడాలున్నాయని పిటిషనర్లు ఆరోపించారు. రీ-వాల్యుయేషన్ చేపట్టి మార్కులను TGPSC పారదర్శకంగా వెల్లడించేలా చూడాలని అభ్యర్థించారు. అభ్యర్థులది తప్పుడు అఫిడవిట్ అని ప్రాథమిక వివరాల పరిశీలన ద్వారా గుర్తించామని కోర్టు స్పష్టం చేసింది. వాస్తవాల్ని దాచి కోర్టును తప్పుదోవ పట్టించారని, పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలంటూ జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ను న్యాయమూర్తి ఆదేశించారు.