వెలమ, కమ్మ వంటి బలమైన కుల సంఘాలకు భూములు కేటాయించడం ఎందుకు అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ రెండు సంఘాలకు తెలంగాణ సర్కారు భూ కేటాయింపులు జరపడంపై స్టే విధించింది. పేద వర్గాలకు చెందిన సంఘాలకు భూములిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ బలమైన కులాలకు ఎందుకంటూ ప్రశ్నించింది. కులాల వారీగా భూముల కేటాయింపును తప్పు పట్టిన హైకోర్టు.. ఇది కూడా ఓ కబ్జా లాంటిదే అని, ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

వెలమ, కమ్మ కుల సంఘాలకు 5 ఎకరాల చొప్పున ల్యాండ్స్ అలాట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కాకతీయ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి… హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం… భూ కేటాయింపులపై జారీ అయిన జీవో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని చెప్పింది.