కోకాపేటలో BRSకు ల్యాండ్ కేటాయింపుపై హైకోర్టు నోటీసులు జారీచేసింది. 11 ఎకరాల భూకేటాయింపుపై కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుకు, BRSకు నోటీసులు ఇచ్చింది. ఈ ల్యాండ్ కోసం ఇచ్చిన GOపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(FGG) దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.3.41 కోట్లకే ఎలా ఇస్తారంటూ కోర్టుకు పిటిషనర్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పేపర్లన్నీ సీక్రెట్ గా మెయింటెయిన్ చేశారని, ఈ GOను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, BRSకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది.
హైదరాబాద్ లోని అత్యంత విలువైన ప్రాంతమైన కోకాపేటలో భూమి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.. ఈనెల 10న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. కేవం 5 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేశారని, అంతా సీక్రెట్ మెయింటెయిన్ చేశారంటూ కోర్టుకు వెళ్లింది.