స్థానిక సంస్థల ఎన్నికల్లో BC రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వాటి అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రిజర్వేషన్లపై అధ్యయనాన్ని BC కమిషన్ కు అప్పగించడం సరికాదని అభిప్రాయపడిన న్యాయస్థానం.. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రత్యేక కమిషన్ ను రెండు వారాల్లో ఏర్పాటు చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.