BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ఆక్రమణలు(Encroachments) ఉంటే చట్టప్రకారమే ముందుకెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆక్రమణల పేరుతో కూల్చివేతలకు పాల్పడుతున్న అధికారులు తమ విద్యాసంస్థల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలన్న పిటిషన్ పై ఈ ఆదేశాలిచ్చింది.
అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ శనివారం వేసిన హౌజ్ మోషన్ పిటిషన్ పై శనివారం రాత్రి విచారణ జరిగింది. యూనివర్సిటీకి చెందిన 6 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉందన్న అధికారుల నివేదికపై వాదనలు కొనసాగాయి. అన్ని పర్మిషన్లతోనే కట్టడాలు చేపట్టామని, రాజకీయ కక్షతోనే కుట్రకు పాల్పడుతున్నారంటూ పిటిషన్ లో తెలియజేయగా… ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్.. చట్ట ప్రకారమే ముందుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.