హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల్లో రేపటివరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. కోర్టు సమయం ముగియడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది. 400 ఎకరాల భూమిని TGIICకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 54 జీవో తీసుకొచ్చింది. ఆ భూముల్లో చదును చేస్తుండటం పట్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) విద్యార్థులు, వివిధ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై వట ఫౌండేషన్, HCU స్టూడెంట్స్ సహా 3 పిల్స్ దాఖలయ్యాయి. వన్యప్రాణులున్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలని, అరుదైన జంతు జాతులున్నందున వాటిని పరిరక్షించాల్సి ఉందని HCU తరఫు లాయర్ వాదించారు. వాదనలు విన్న కోర్టు విచారణ వాయిదా వేసింది.