కాళేశ్వరం కమిషన్ నివేదికపై మరోసారి KCR, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. CBI విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని, అసెంబ్లీలో తీర్మానం చేయకుండానే అప్పగించడం సరికాదని హరీశ్ న్యాయవాది తెలిపారు. ఒకవేళ CBIకి సర్కారు అప్పగిస్తే రేపటి విచారణకు అర్థం ఉండదన్నారు. రేపటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై ఉత్తర్వుల్ని, అత్యవసర పిటిషన్ ను నిరాకరించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. రేపు తదుపరి విచారణను కొనసాగించనుంది.