మాజీ మంత్రి KTRకు హైకోర్టులో షాక్ తగిలింది. ACB కేసు కొట్టివేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయన క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చుతూ, కేసుకు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఆయనపై ACB కేసులు నమోదు చేసింది. డిసెంబరు 31న ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ACB తరఫున అడ్వొకేట్ జనరల్(AG) సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
చెల్లింపుల్లో KTR పాత్ర ఏంటని వాదనల సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఆయన పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని, FIR అనేది దానికోసమేనని AG తెలిపారు. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా సీజన్-9 నిర్వహించాక నష్టాలు వచ్చాయని కంపెనీ ఒప్పందం నుంచి తప్పుకొందని KTR తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తప్పుకున్న సంస్థపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అడ్వొకేట్ జనరల్(AG) కోర్టు దృష్టికి తెచ్చారు.