లగచర్ల కేసులో అరెస్టులపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు సంధించిది. కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తప్పుబడుతూ.. ఆయన పరారీలో ఉన్నారా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ప్రశ్నలు వేసింది. వాకింగ్(Walking)కు వెళ్లిన వ్యక్తిని ఒక ఉగ్రవాది(Terrorist) మాదిరిగా అరెస్టు చేయడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండా, ముందస్తు నోటీసులివ్వకుండా అరెస్టు చేశారని చెప్పింది. సుప్రీం తీర్పులను కింది కోర్టు కనీసం లెక్కలోకి తీసుకోలేదంటూ, అధికారుల గాయాలపై అందజేసిన నివేదికపైనా అసహనం వ్యక్తం చేసింది.
ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్ రెడ్డి వ్యవహరించారని న్యాయస్థానానికి PP తెలియజేశారు. ఆయన పిటిషన్ కు ఆమోదం తెలిపితే ఇన్వెస్టిగేషన్ పై ప్రభావం పడుతుందన్నారు. తన రిమాండ్ కొట్టివేయాలంటూ BRS మాజీ MLA నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.