ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది. ఈ కేసు FIRను హైకోర్టు కొట్టివేసింది. హరీశ్ తోపాటు మాజీ DCP రాధాకిషన్ రావుపై పంజాగుట్ట PSలో గతేడాది కేసు ఫైల్ అయింది. స్థిరాస్తి వ్యాపారి(Realter) చక్రధర్ గౌడ్ కంప్లయింట్ ఆధారంగా ఆ ఇద్దర్నీ నిందితులుగా చేర్చారు. కేసులో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును నేడు ప్రకటిస్తూ కేసును కొట్టివేసింది. ఫిర్యాదు చేసిన వ్యక్తికి కాంగ్రెస్ తో సంబంధం ఉందని, కానీ పిటిషన్లో ఆ అంశం ప్రస్తావించలేదంటూ హరీశ్ న్యాయవాది వాదించారు.ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో రాధాకిషన్ రావు 10 నెలల పాటు రిమాండ్ కు వెళ్లారు.