విమానాల ఇంధనం(Fuel)లోనూ కల్తీ జరుగుతోందని, ఏదైనా జరిగితే ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలుస్తాయని హైకోర్టు తీవ్రంగా మండిపడింది. డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారని జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు. శంషాబాద్(Shamshabad) విమానాశ్రయానికి ఇంధన సరఫరా చేస్తున్న ట్యాంకర్లలో కల్తీ జరిగిందని IOCL గుర్తించింది. ట్యాంకర్లలో నింపి ORR వద్దకు వచ్చాక డ్రైవర్లు కల్తీ చేస్తున్నారని తేల్చి కాంట్రాక్టు రద్దు చేసింది. కాంట్రాక్టు రద్దుతోపాటు తన డిపాజిట్ జప్తు చేయడంపై గుత్తేదారు గురునాథం పిటిషన్ వేశారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.