ఫీజుల్ని(Fees) పెంచుకునేందుకు అనుమతివ్వాలన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల వినతిని తోసిపుచ్చిన హైకోర్టు… పిటిషన్లు కొట్టివేసింది. ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(TAFRC)యే నిర్ణయం తీసుకుని.. ఆరు వారాల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలిచ్చింది. సర్కారు తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. పాత ఫీజులే 2025-26కు వర్తిస్తాయన్న జీవోను 11 కాలేజీలు సవాల్ చేశాయి. ఇప్పుడు పెంచితే ఇంజినీరింగ్, MBA, MCA విద్యార్థులపై భారం పడుతుందని TAFRC న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మూడేళ్లకోసారి కాలేజీల్ని పరిశీలించి పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా అలా ఎందుకు చేయలేదంటూ జస్టిస్ కె.లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో TAFRCపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదంటూనే కౌన్సెలింగ్ అయిపోయాక పిటిషన్లేంటని ప్రశ్నించారు. https://justpostnews.com