పార్టీ మారిన MLAలపై ఫిర్యాదుల్ని స్పీకర్ ముందుంచాలని, నాలుగు వారాల్లోగా వాటిని స్పీకర్ ఎదుటకు తీసుకెళ్లాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల్ని CJ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. MLA అనర్హత పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పు వెలువరించింది. స్పీకర్ కు ఎలాంటి టైమ్ బాండ్ లేదంటూనే తుది నిర్ణయం తీసుకోవాలని ద్విసభ్య ధర్మాసనం(Devision Bench) ఆదేశించింది.
తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు బెంచ్ సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిగణలోకి తీసుకోవడంతోపాటు ప్రజలిచ్చిన తీర్పు ప్రకారం అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం వెలువరించాలంటూ స్పీకర్ ను ఆదేశించింది. ఫిరాయింపులకు పాల్పడిన MLAలపై విచారణ షెడ్యూల్ డిసైడ్ చేయాలంటూ సెప్టెంబరు 9న సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. సింగిల్ బెంచ్ ఆదేశాల్ని కొట్టివేస్తూ తాజాగా తీర్పునిచ్చింది.