ప్రభుత్వ ఉన్నత పాఠశాలల సమయ వేళల్లో(Timings) విద్యాశాఖ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న విధానానికి బదులు ప్రాథమిక(Primary), ప్రాథమికోన్నత(Upper Primary) పాఠశాలల మాదిరిగా హైస్కూళ్లలోనూ అదే విధమైన పని వేళల్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక నుంచి హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు పనిచేస్తాయి. ఇప్పటిదాకా ఇది ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంది.
ట్రాఫిక్ దృష్ట్యా హైదరాబాద్ జంట నగరాల్లో పొద్దున 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ఈ కొత్త నిర్ణయంపై HODలు, రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, DEOలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు.