రాష్ట్రంలో ఎండ దంచికొడుతుండగా, మార్చిలోనే ఉష్ణోగ్రతలు(Temparatures) బాగా పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40.3, నిజామాబాద్ జిల్లాలో 40.1 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు(మార్చి 15న) ఈ 4 జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశాలున్నాయి. సాధారణం కన్నా 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి క్రమంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎండలు విస్తరించనున్నాయి. https://justpostnews.com