వివాదాస్పదంగా తయారైన VRAల సర్దుబాటు అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. విద్యార్హతను బట్టి నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలన్న నిర్ణయాన్ని తప్పుబడుతూ దాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. VRAలను ఇతర శాఖల్లోకి మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్వాలిఫికేషన్స్, సామర్థ్యాల మేరకు వారిని సర్దుబాటు చేయాలని అధికారులకు ఈ మధ్య CM స్పష్టం చేశారు. నీటిపారుదలతోపాటు ఇతర శాఖల్లో ఖాళీలను బట్టి కేటాయింపులు చేయాలని, అనంతరం వారి సర్వీసుని విస్తృతంగా వాడుకోవాలన్నారు. ఇందుకోసం VRAలతో చర్చించి ఒపీనియన్స్ తీసుకోవాలని, వారి ద్వారా సేకరించిన అభిప్రాయం మేరకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి GO జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ VRAలు హైకోర్టు మెట్లెక్కారు.
VRAల సర్దుబాటు GOలను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ఇంతకుముందున్న స్థితినే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వారి పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.