
జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల(guest faculty)ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఎలిజిబిలిటీ కలిగిన గెస్ట్ ఫ్యాకల్టీని ఈ ఏడాది పాటు కంటిన్యూ చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఇంటర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీల కొనసాగింపుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. గతంలో నియమితులైన ఉపాధ్యాయుల్ని ఈసారీ కంటిన్యూ చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంటర్మీడియట్ కమిషనరేట్ కు నోటీసులు జారీ చేసింది.
జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి ఈ నెల 18న నోటిఫికేషన్ ఇవ్వడంతో.. దీన్ని సవాల్ చేస్తూ కొందరు అధ్యాపకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా చేపట్టనున్న రిక్రూట్ మెంట్ లో తమకు సరైన ప్రాధాన్యత(priority) ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో కోర్టు.. అర్హులైన గెస్ట్ ఫ్యాకల్టీని ఈ సంవత్సరం కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది.