మాజీ మంత్రి KTRకు చెందిన జన్వాడ ఫాంహౌజ్ పై రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగురవేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2020లో రేవంత్ సహా పలువురిపై నార్సింగి PSలో కేసు నమోదైంది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. జన్వాడ నిషేధిత(Banned) ప్రాంతమేమీ కాదని, డ్రోన్ ఎగరేసిన ప్రాంతం ఎటువంటి నిషేధిత జాబితాలో లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. పూర్తి వాదనలు విన్న కోర్టు.. కేసును కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది.
అటు KTRపై గతంలో ఫైల్ అయిన కేసును సైతం కొట్టివేసింది. CMను కించపరిచే విధంగా దూషించారంటూ MP అనిల్ కుమార్ యాదవ్ కంప్లయింట్ ఇవ్వడంతో సైఫాబాద్ లో కేసు పెట్టారు. దాన్ని కొట్టివేయాలంటూ KTR వేసిన క్వాష్ పిటిషన్లో వాదనలు విన్న కోర్టు.. FIRను కొట్టివేసింది.