స్థానిక సంస్థల(Local Bodies) ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సకాలంలో నిర్వహించట్లేదంటూ ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున వాదనలు పూర్తయ్యాయి. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటిదాకా ఎందుకు తాత్సారం చేసిందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్ని రోజుల్లో ఎలక్షన్లు నిర్వహించగలరని ప్రశ్నించగా, సమయం కావాలని సర్కారు కోరింది. ఇటు ఎలక్షన్ కమిషన్ సైతం 60 రోజుల గడువు కోరింది. అయితే ఆరు నెలల్లోనే ఎన్నికలు పూర్తి చేయాలన్న నిబంధనను గుర్తు చేసిన పిటిషనర్లు.. అలా జరగకుంటే పాత సర్పంచులనే కొనసాగించాలని కోరారు. సర్పంచుల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసింది.
https://justpostnews.com