ఆర్థిక వెనుకబడిన వర్గాల(EWS) రిజర్వేషన్లు కల్పించేలా చూడాలంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్టేట్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవో 57, 58 తీరుపై SI, కానిస్టేబుల్ అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. EWS రిజర్వేషన్ కల్పించకపోతే అన్యాయానికి గురవుతామంటూ కోర్టుకు విన్నవించారు. దీనిపై రిక్రూట్ మెంట్ బోర్డుకు నోటీసులు ఇష్యూ చేసిన న్యాయస్థానం… తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.