
గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ మళ్లీ మూల్యాంకనం చేపట్టాలని TGPSCని ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. అభ్యర్థులందరి పునర్ మూల్యాంకనం(Re Valuation) ఆధారంగానే తదుపరి ప్రక్రియ చేపట్టాలని తీర్పునిచ్చింది. వీటిని పాటించకపోతే ప్రిలిమ్స్ లో అర్హులైన అభ్యర్థులతో మరోసారి మెయిన్స్ నిర్వహించేందుకు ఆదేశాలివ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. https://justpostnews.com
జులై 17న ఆయా వర్గాల వాదనలు పూర్తికాగా.. తీర్పును జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు రిజర్వ్ చేసి ఈరోజు వెలువరించారు. రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటూ మొత్తం ప్రక్రియకు 8 నెలల గడువు విధించారు. దీనిపై TGPSC అప్పీల్ కు వెళ్తుందా లేక ఆదేశాలు పాటిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.