వేములవాడ మాజీ MLA చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన జర్మన్ పౌరుడే(Citizen)నని తేల్చడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు పత్రాలతో కొన్నేళ్లుగా వ్యవస్థల్ని మోసం చేస్తున్నారంటూ ఆయనకు మొత్తంగా రూ.30 లక్షల జరిమానా(Fine) విధించింది. అందులో రూ.25 లక్షల్ని పిటిషనర్, ప్రస్తుత శాసనసభ్యుడైన ఆది శ్రీనివాస్ కు, మరో రూ.5 లక్షల్ని లీగల్ సర్వీసెస్ అథారిటీ చెల్లించాలని తీర్పునిచ్చింది.
చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడిగానే ఉంటూ ఇక్కడ MLAగా గెలిచారని కోర్టు గుర్తించింది. జరిమానా విధించిన డబ్బును నెల రోజుల్లోపు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు పదిన్నర సంవత్సరాలుగా నడుస్తుండగా, వాదనల సందర్భంగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కోర్టు సీరియస్ అయింది. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మోసం చేశారంటూ ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.