రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా.. అత్యధికం(Highest)గా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లిలో 19.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పొద్దున 8:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంచుమించు 12 గంటల వ్యవధిలో ఈ స్థాయి వర్షం పడింది.
కామారెడ్డిలో 16, అదే జిల్లా గాంధారి మండలం సర్వాపూర్లో 15.7, సిద్దిపేట జిల్లా మిర్ దొడ్డిలో 15.4, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 15.3, గాంధారిలో 14.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం(Rainfall) నమోదై టాప్-5లో నిలిచాయి. మిగతా జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డయింది.