హైదరాబాద్ జంటనగరాలు సహా వివిధ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉప్పల్(Uppal)లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇన్నిరోజులూ చినుకు లేక అవస్థలు పడిన ప్రజలు ఈ వర్షాలతో ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలిలా…
జిల్లా | మండలం | ప్రాంతం | సెం.మీ. |
ఖమ్మం | వేమ్సూర్ | వేమ్సూర్ | 8.3 |
మంచిర్యాల | బెల్లంపల్లి | బెల్లంపల్లి | 7.8 |
హైదరాబాద్ | మారేడ్ పల్లి | న్యూమెట్టుగూడ | 6.8 |
ఖమ్మం | మధిర | మధిర | 6.7 |
యాదాద్రి భువనగిరి | నారాయణపూర్ | జనగాం | 6.4 |
సూర్యాపేట | గరిడేపల్లి | గరిడేపల్లి | 6.05 |