
భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలోని స్కూళ్లకు సెలవు ప్రకటించింది. హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. GHMC పరిధిని వివిధ సర్కిళ్లలో ఇప్పటికే 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చే అవకాశం లేకుండా రోడ్లన్నీ మోకాళ్ల లోతు నీళ్లలో చిక్కుకున్నాయి. దీంతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.