వరుస దుర్ఘటనలు చోటుచేసుకుంటున్న పరిస్థితుల్లో బాసర ట్రిపుల్ ఐటీ(RGUKT)లో హాలిడేస్ ప్రకటించారు. పీయూసీ-1 కొత్త బ్యాచ్ స్టూడెంట్స్ కు ఈ నెల 14 వరకు సెలవులు ఇచ్చారు. కొత్త విద్యార్థులకు హోమ్ సిక్ కింద హాలిడేస్ ఇస్తున్నట్లు VC ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో RGUKTకి చేరుకున్నారు. ఈ నెల 1న PUC-1 బ్యాచ్ ప్రారంభం కాగా, 8న జాదవ్ బబ్లూ అనే స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది కాలంలోనే నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బాసర ట్రిపుల్ ITలో తీవ్ర గందరగోళం నెలకొంది. మొత్తం PUC-1కు సంబంధించి 1400 మందికి పైగా విద్యార్థులున్నారు. ఇప్పుడు వారందరికీ సెలవులు ఇస్తూ VC డిసిషన్ తీసుకున్నారు.