
ఇప్పటివరకు మహిళలకు ఫ్రీ పేరిట 237 కోట్ల జీరో టికెట్లు ఇచ్చారు. ఇందుకుగాను TGSRTCకి రూ.7,980 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మీ స్కీమే కాకుండా ఆదాయం పెంపుపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. అడ్వర్టయిజ్‌మెంట్స్ ద్వారా అదనపు ఆదాయం రాబట్టాలన్నారు. నష్టాల్లో నడుస్తున్న డిపోలపై అధ్యయనానికి కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వాలని MD నాగిరెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్ లో ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులుండగా, PM ఈ-డ్రైవ్ కింద విడతలవారీగా వచ్చే మిగతా 1,500 కలిపి మొత్తం 2 వేల బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్లు సిద్ధంగా ఉంచాలన్నారు.