సరస్వతి నదీ పుష్కరాల(Pushkaralu) కోసం భారీగా జనం తరలిరావడంతో కాళేశ్వర త్రివేణీ సంగమం జనసంద్రంతో నిండిపోయింది. ఈ నెల 15న మొదలైన పుష్కరాలు 26 వరకు కొనసాగుతాయి. మరో మూడ్రోజులు మాత్రమే ఉండటంతో పుష్కర స్నానాలకు పెద్దయెత్తున జనం తరలివస్తున్నారు. కాళేశ్వరం(Kaleshwaram) సమీపంలో 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. నాలుగు గంటలుగా భక్తులు ట్రాఫిక్ లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు.