హైదరాబాద్ మెట్రో రైలు(Metro Rail).. మిగతా దశల్లో నగరం మొత్తం చుట్టి రానుంది. రెండో దశ DPR(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మొదటి దశలో మూడు కారిడార్లకు గాను 69 కిలోమీటర్ల మేర రైళ్లు తిరుగుతున్నాయి. ఇందులో కొన్నింటిని పొడిగించడంతోపాటు మరో ఆరు కారిడార్లు కొత్తగా రానున్నాయి.
రెండో దశలో 116 కిలోమీటర్లతో కలిపి మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది. నాగోలు-ఆరాంఘర్-ఎయిర్పోర్ట్ వరకు 4వ కారిడార్లో 36.6 కిలోమీటర్లకు గాను 1.6 కిలోమీటర్లు భూగర్భం నుంచి వెళ్లేలా ప్లాన్ చేశారు. ఐదో కారిడార్లో రాయదుర్గం-కోకాపేటకు 11.6 కి.మీ.. ఆరో కారిడార్లో MGBS-చాంద్రాయణగుట్ట వరకు మరో 7.5 కిలోమీటర్లు పెంచడం.. ఏడో కారిడార్ మియాపూర్ నుంచి పటాన్ చెరు 13.4 కిలోమీటర్లు విస్తరణ.. ఎనిమిదో కారిడార్ ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు అదనంగా 7.1 కిలోమీటర్ల మేర పెరగనుంది. ఇక తొమ్మిదో కారిడార్లో శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర రైలు రాబోతుండగా.. ఇందుకోసం రూ.32,237 కోట్లు అవుతుందని అంచనా వేశారు.