విఘ్నేశ్వరుడి లడ్డూ కొత్త రికార్డులు సృష్టించింది. ఏకంగా కోటీ 87 లక్షల 36 వేల 500కు అమ్ముడుపోయి సంచలనంగా మారింది. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంలో రూ.1.87 కోట్లకు పైగా ధర పలికింది. గతేడాది ఇక్కడ రూ.1.20 కోట్లు పలకగా ఈసారి అంతకుమించి భారీస్థాయిలో నగదు వచ్చింది.
లడ్డూ విషయానికి వస్తే హైదరాబాద్ బాలాపూర్ గణేశుడి వేలం పాట ఏటేటా పెరుగుతూనే ఉంది. గతేడాది రూ.27 లక్షలు పలికితే ఈసారి అది రూ.30 లక్షల దాకా ఉండొచ్చని అంచనా వేశారు. కానీ అంతకు ఆరు రెట్లకు పైగా కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో ధర పలుకుతూనే ఉంది.