భారీ వర్షాలకు వాగులు పొంగి తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ-వరంగల్ మధ్య రైళ్లు కూడా ఆపేశారు. తెలంగాణ-ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉప్పొంగడంతో నల్లబండగూడెంలో హైవేపై నీరు చేరింది. దీంతో హైదరాబాద్-విజయవాడ మార్గం(Way)లో రాకపోకలు లేకుండా పోగా.. కోదాడ సిటీ నీటిలో చిక్కుకుపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
మున్నేరు వాగు ఉద్ధృతితో ఖమ్మం కాలనీలన్నీ నీటిలోనే ఉన్నాయి. తమను రక్షించాలంటూ ఇళ్ల పైకి చేరి ఆర్తనాదాలు చేస్తున్నారు. బాధితులకు డ్రోన్(Drone) ద్వారా లైఫ్ జాకెట్లను అందించారు అధికారులు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో ఓ కుటుంబమే గల్లంతైంది. తిరుమలాయపాలెం రాకాసితండాను ఆకేరు వాగు వరద చుట్టుముట్టడంతో NDRF బృందాలు చేరుకున్నాయి. హెలికాప్టర్ కు ఛాన్స్ బోట్ల ద్వారా బయటకు తరలిస్తున్నారు.