ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం ఐదుగురు అధికారులకు కొత్త బాధ్యతలు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి ఆర్డర్స్ ఇచ్చారు. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో మిక్కిలినేని మను చౌదరిని పంపిస్తున్నారు.
బదిలీ అయిన అధికారులు వీరే…
అధికారి పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
ప్రశాంత్ జీవన్ పాటిల్ | కలెక్టర్, సిద్దిపేట | ప్రత్యేక కార్యదర్శి, నీటిపారుదల శాఖ |
మిక్కిలినేని మనుచౌదరి | అడిషనల్ కలెక్టర్(LB), కామారెడ్డి | కలెక్టర్, సిద్దిపేట |
రిజ్వాన్ బాషా షేక్ | మున్సిపల్ కమిషనర్, వరంగల్ | కలెక్టర్, జనగామ |
సి.హెచ్.శివలింగయ్య | కలెక్టర్, జనగామ | రిపోర్ట్, GAD(సాధారణ పరిపాలన శాఖ) |
శైలజారామయ్యర్ | ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి | దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి(FAC) |