
Published 15 Dec 2023
రాష్ట్రంలో మరింతమంది IAS(Indian Administrative Service) అధికారులకు పోస్టింగ్ లు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న 8 మంది ఉన్నతాధికారులకు స్థాన చలనం కల్పించిన సర్కారు ఈరోజు సైతం పలువురికి వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ లు కట్టబెట్టింది. మొత్తం తొమ్మిది మందికి పోస్టింగ్ లు ఇవ్వగా అందులో 8 మంది 2021 బ్యాచ్ కు చెందినవారే ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్ గా నియమితులైన పి.కదివరన్ మాత్రమే 2020 బ్యాచ్ కు చెందిన అధికారి. ఈ తొమ్మిది మందిని స్థానిక సంస్థల(Local Bodies) అడిషనల్ కలెక్టర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు.
అధికారుల బాధ్యతలు ఇవే..
లెనిన్ వత్సల్ తొపొ, అదనపు కలెక్టర్(LB), మహబూబాబాద్
పి.గౌతమి, అదనపు కలెక్టర్(LB), రాజన్న సిరిసిల్ల
రాధికా గుప్తా, అదనపు కలెక్టర్(LB), హన్మకొండ
పి.పి.లలిత్ కుమార్, అదనపు కలెక్టర్(LB), జనగామ
శివేంద్ర ప్రతాప్, అదనపు కలెక్టర్(LB), మహబూబ్ నగర్
సంచిత్ గాంగ్వార్, అదనపు కలెక్టర్(LB), వనపర్తి
పి.శ్రీజ, అదనపు కలెక్టర్(LB), ములుగు
ఫైజాన్ అహ్మద్, అదనపు కలెక్టర్(LB), నిర్మల్
పి.కదిరవన్, అదనపు కలెక్టర్(LB), జయశంకర్ భూపాలపల్లి