రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కీలకమైన శాఖల్లో ఈ నలుగురు అధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి. GHMC కమిషనర్ గా పనిచేస్తున్న D.S.లోకేశ్ కుమార్(2003 బ్యాచ్) ను అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో D.రొనాల్డ్ రాస్(2006 బ్యాచ్) ను GHMC కమిషనర్ గా నియమించారు. ప్రస్తుతం రొనాల్డ్ రాస్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
ఇక ప్రొహిబిషన్, ఎక్సైజ్ డైరెక్టర్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్(2009 బ్యాచ్)ను ఎన్నికల సంఘం(EC) ఆదేశాల మేరకు జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా నియమించారు. T.రవికిరణ్(IFS) స్థానంలో సర్ఫరాజ్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న ముషారఫ్ అలీ ఫరూఖీ(2014 బ్యాచ్)కి ప్రొహిబిషన్, ఎక్సైజ్ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు. సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో ముషారఫ్ అలీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నలుగురు ఉన్నతాధికారుల్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.