Published 14 Dec 2023
రాష్ట్రంలో ఐఏఎస్ లకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కేంద్ర సర్వీసుల డిప్యుటేషన్ పూర్తి చేసుకుని రాష్ట్ర కేడర్ కు తిరిగివచ్చిన అమ్రపాలి కాటకు కీలక పోస్టింగ్ కట్టబెట్టింది. ఆమెను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) జాయింట్ కమిషనర్ తోపాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంఛార్జి మేనేజింగ్ డైరెక్టర్(MD)గా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. గత ప్రభుత్వంలో చేనేత శాఖ కార్యదర్శిగా పనిచేసిన శైలజా రామయ్యర్ కు ఈ ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టింగ్ దక్కింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
అధికారుల పోస్టింగ్ లివే…
అమ్రపాలి – HMDA జాయింట్ కమిషనర్, మూసీ అభివృద్ధి సంస్థ ఇంఛార్జి MD
కృష్ణభాస్కర్ – డిప్యుటీ సీఎం OSD
కర్నాటి వరుణ్ రెడ్డి – ఉత్తర డిస్కమ్(NPDCL) CMD
శైలజా రామయ్యర్ – వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి
సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి – ఇంధనశాఖ కార్యదర్శి… ట్రాన్స్ కో, జెన్ కో ఇంఛార్జి CMD
సందీప్ కుమార్ ఝా – ట్రాన్స్ కో జాయింట్ MD
ముషారఫ్ అలీ – దక్షిణ డిస్కమ్(SPDCL) CMD
బి.గోపి – వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్