Published 17 Dec 2023
మరో 11 మంది IAS అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 11 మంది అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా కీలక విభాగంలో ఉన్న అర్వింద్ కుమార్ ను లూప్ లైన్ కు పంపించింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. నల్గొండ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ను అక్కణ్నుంచి బదిలీ చేస్తూ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా నియమించింది. గత ప్రభుత్వంలో కీలక స్థానాలైన మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు HMDA కార్యదర్శిగా ఉన్న అర్వింద్ కుమార్ ను మార్చింది. విద్యాశాఖ అదనపు బాధ్యతలను బుర్రా వెంకటేశంకు అప్పగిస్తూ.. జల మండలి కమిషనర్ గా ఉన్న దానకిశోర్ ను పురపాలక శాఖకు పంపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు.
అధికారులు – బాధ్యతలు
బుర్రా వెంకటేశం – ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి
దానకిశోర్ – DME పురపాలక శాఖ, HMDA కమిషనర్
అర్వింద్ కుమార్ – ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విపత్తు నిర్వహణ శాఖ
క్రిస్టినా జడ్ చోంగ్త్ – వైద్యారోగ్య శాఖ కార్యదర్శి
టి.కె.శ్రీదేవి – కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ
ఆర్.వి.కర్ణన్ – డైరెక్టర్, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ
వాణిప్రసాద్, , ముఖ్యకార్యదర్శి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈపీటీఆర్ఐ డెరెక్టర్
సుదర్శన్ రెడ్డి – జలమండలి మేనేజింగ్ డైరెక్టర్
రాహుల్ బొజ్జా- ఎస్సీ అభివృద్ధి శాఖ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ
వాకాటి కరుణ – కార్యదర్శి, మహిళా, శిశు సంక్షేమ శాఖ
కె.ఎస్.శ్రీనివాసరాజు- ముఖ్య కార్యదర్శి, ఆర్ అండ్ బీ శాఖ