Published 03 Jan 2024
రేవంత్ రెడ్డి సర్కారు భారీగా ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్(IAS Transfers) చేసింది. ఇందులో సీనియర్ అధికారులతోపాటు మొత్తం 26 మందికి స్థాన చలనం కలిగించింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించిన స్మిత సబర్వాల్ ను ఆర్థిక శాఖ సభ్య కార్యదర్శి పోస్టుకు పంపించారు. నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ CS శాంతికుమారి ఆర్డర్స్ ఇచ్చారు.
పోస్టింగ్స్ ఇలా…
బెనహర్ మహేశ్ దత్ ఎక్కా – ప్రిన్సిపల్ సెక్రటరీ, మైన్స్ & జియాలజీ
అహ్మద్ నదీమ్ – ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక శాఖ
రాహుల్ బొజ్జా – కార్యదర్శి, నీటిపారుదల శాఖ
స్మితా సబర్వాల్ – సభ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ
ఎ.శరత్ – కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ
డి.దివ్య – డైరెక్టర్, పురపాలక శాఖ & ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్
దాసరి హరిచందన – కలెక్టర్, నల్గొండ జిల్లా
భారతి హోళికేరి – డైరెక్టర్, పురావస్తు శాఖ
కె.శశాంక – కలెక్టర్, రంగారెడ్డి జిల్లా
అద్వైత్ కుమార్ సింగ్ – కలెక్టర్, మహబూబాబాద్
చిట్టెం లక్ష్మీ – మేనేజింగ్ డైరెక్టర్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
కృష్ణ ఆదిత్య – డైరెక్టర్, కార్మిక శాఖ
ఆయేషా మస్రత్ ఖానమ్ – కార్యదర్శి, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు
ఎస్.సంగీత సత్యనారాయణ – సంయుక్త కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం
వల్లూరు క్రాంతి – కలెక్టర్, సంగారెడ్డి జిల్లా
బి.ఎం.సంతోష్ – కలెక్టర్, జోగులాంబ గద్వాల జిల్లా
అభిలాష అభినవ్ – జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ
పి.కదివరన్ – అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), హైదరాబాద్
బి.వెంకటేశం – ముఖ్య కార్యదర్శి(FAC), బీసీ సంక్షేమ శాఖ
సందీప్ కుమార్ సుల్తానియా – ముఖ్య కార్యదర్శి(FAC), పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ
జ్యోతి బుద్ధ ప్రకాశ్ – మెంబర్ సెక్రటరీ, కాలుష్య నియంత్రణ మండలి
ఎం.రఘునందన్ రావు – ప్రభుత్వ కార్యదర్శి(పొలిటికల్-FAC), GAD
ఎం.ప్రశాంతి – డైరెక్టర్(FAC), ఆయుష్ విభాగం
డి.కృష్ణభాస్కర్ – ప్రత్యేక కార్యదర్శి(FAC), ఆర్థిక & ప్రణాళిక శాఖ
ఆర్.వి.కర్ణన్ – MD, మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(TSMSIDC)
ఎం.హరిత – డైరెక్టర్(FAC), సహకార సంస్థలు