ఆరుగురు IASలకు పోస్టింగ్ లు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. GHMC కమిషనర్ అమ్రపాలిని.. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(MRDCL), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, HMDA జాయింట్ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో ఆమె ఇక GHMC కమిషనర్ గానే పూర్తి బాధ్యతలు చూడనున్నారు. ఆమె వదిలిపెట్టనున్న మూడు విభాగాల్ని ముగ్గురు IASలు చూస్తారు.
అమ్రపాలి కాట…………: GHMC కమిషనర్
ఎం.దానకిశోర్………….: పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి.. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ MD
సర్ఫరాజ్ అహ్మద్……: HMDA కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ MD(అదనపు బాధ్యతలు)
కోట శ్రీవాస్తవ…………..: HMDA జాయింట్ కమిషనర్
చాహత్ బాజ్పాయ్……: కరీంనగర్ మున్సిపల్ కమిషనర్
మయాంక్ మిట్టల్……: HMWS&SB ఈడీ